సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తా.. ఎమ్మెల్యేల మీటింగ్‌పై జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Congress MLAs) రహస్యంగా సమావేశం అయ్యారంటూ వచ్చిన వార్తలు కాంగ్రెస్‌లోనే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి.

సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తా.. ఎమ్మెల్యేల మీటింగ్‌పై జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Congress MLAs) రహస్యంగా సమావేశం అయ్యారంటూ వచ్చిన వార్తలు కాంగ్రెస్‌లోనే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. ఈ సమావేశంపై కాంగ్రెస్ అధిష్టానం(Telangana Congress)తో పాటు సమావేశమైన ఎమ్మెల్యేలు సైతం స్పందించి క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గాల అభివృద్ధిపై ఎమ్మెల్యేలం కలిసి మాట్లాడుకుంటే తప్పేంటి అని అన్నారు. మరోవైపు ఆ సమావేశానికి నాయకత్వం వహించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Jadcherla MLA Anirudh Reddy)తో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud)​తాజాగా ఫోన్‌లో మాట్లాడారు. ఇలాంటి సమావేశాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏర్పాటు చేయడం సరికాదని చెప్పారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి లేదా..? సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

తాజాగా.. ఈ సమావేశంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్యేల మీటింగ్ వార్తలు వచ్చాయి.. కొన్ని విషయాలు ఇప్పుడే షేర్ చేయలేను.. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ చెప్తా.. రాహుల్ గాంధీ(Rahul Gandhi) చెప్పినప్పటి నుంచి పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడం లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు, నేతలకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది.. ఇంపార్టెంట్ అయితే.. సీఎం జోక్యం చేసుకుంటారు.. ఎమ్మెల్యేల వాయిస్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలి.. ఓడిపోయిన వాళ్లను పార్టీ నాయకత్వం చూసుకోవాలి’’ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదిఇలా ఉంటే.. తెలంగాణలో తిరుగుబాటు మీటింగ్ ఏర్పాటైందన్న ప్రచారం ఊపందుకోవడంతో కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు ఉలిక్కిపడ్డాయి. ఈ ప్రచారానికి తెర దించేందుకు.. ఆ సమావేశానికి ఎవరూ హాజరుకాలేదంటూ కాంగ్రెస్ మీడియాకు వివరణ ఇచ్చింది. తమ ప్రభుత్వంపై ప్రత్యర్థి పార్టీల సోషల్​మీడియాలు ‘తిరుగుబాటు’ పేరుతో విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది. తప్పుడు ప్రచారం చేసిన వారి గుట్టు రట్టు చేయాలని సైబర్​క్రైమ్‌(Cyber Crime)కు ఫిర్యాదు చేసింది.

Next Story