- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రముఖ కాలేజీలో శృతిమించిన 'జాగరణ' ఈవెంట్! విద్యార్థుల ముద్దులాట వైరల్
ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా చెప్పుకునే ఓ ఇంజనీరింగ్ కళాశాలలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించిన 'జాగరణ' కార్యక్రమం వివాదాస్పదంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా చెప్పుకునే ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించిన 'జాగరణ' కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. భక్తి ముసుగులో అర్ధరాత్రి వేళ కొందరు విద్యార్థులు రెచ్చిపోయి చేసిన సరసాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. ఇటీవల మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాలేజీ క్యాంపస్‌లో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు 'జాగరణ' పేరిట ఓ భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు యాజమాన్యం ఒక్కో విద్యార్థి నుంచి ఏకంగా రూ. 3,000 వసూలు చేసినట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీగా డబ్బులు వసూలు చేసి, లోపల విద్యార్థులకు ఎలాంటి నియంత్రణ లేకుండా స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది.
శృతిమించిన సరసాలు..
జాగారం పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో చీకటి పడేసరికి ఈవెంట్ కాస్తా పబ్ కల్చర్‌ను తలపించింది. పలువురు విద్యార్థులు బహిరంగంగానే ముద్దులాట, సరసాలకు దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు సెల్ ఫోన్లలో బంధించి నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. పవిత్రమైన శివరాత్రి రోజున కాలేజీలో ఇలాంటి అశ్లీల కార్యక్రమాలు జరగడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తి పేరుతో ఇలాంటి వికృత సంస్కృతిని ప్రోత్సహించడం ఏంటని మండిపడుతున్నారు.






