- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మియాపూర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో 28న జగన్నాథ రథయాత్ర
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ( ఇస్కాన్) మియాపూర్కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 28న జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నామని

దిశ, తెలంగాణ బ్యూరో: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ( ఇస్కాన్) మియాపూర్కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 28న జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నామని మియాపూర్ఇస్కాన్టెంపుల్అధ్యక్షులు శ్రీరాందాస బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్చందానగర్లోని ఆర్ఎస్.బ్రదర్స్వద్ద నుండి ఈ రథయాత్ర ప్రారంభం అవుతుందని అక్కడి నుండి మదీనాగూడ, ఆల్విన్క్రాస్రోడ్, మియాపూర్క్రాస్రోడ్, జేపీ నగర్వీధుల గుండా కొనసాగుతూ విశ్వనాథ గార్డెన్వద్ద ముగుస్తుందని తెలిపారు.
ఆ రథయాత్ర దారి పొడవునా భక్తుల సౌకర్యార్థం పులిహోర ప్రసాదాలు, మంచినీరు అందిస్తామన్నారు. ఈ యాత్ర లో వివిధ రకాల కీర్తనలు, నృత్యాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా కొనసాగుతుందన్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు విశ్వనాథ గార్డెన్లో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు, పలువురి ప్రసంగాలు ఉంటాయన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని, కనుక జగన్నాథ రథయాత్ర లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శ్రీరాందాస విజ్ఞప్తి చేశారు.






