జగన్‌‌కు రాజకీయ పరిణితి రాలేదు.. టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస రావు

by Kema Shiva Kumar |

అసెంబ్లీ (Assembly)లో ప్రతిపక్షం లేకపోవడం తమకు కూడా బాధగానే ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు (Palla Srinivas Rao) అన్నారు.

జగన్‌‌కు రాజకీయ పరిణితి రాలేదు.. టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస రావు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ (Assembly)లో ప్రతిపక్షం లేకపోవడం తమకు కూడా బాధగానే ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు (Palla Srinivas Rao) అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. ఓ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ (Jagan) ప్రజా తీర్పును గౌరవించాలని.. ఎమ్మెల్యేల సంఖ్య ముఖ్యం కాదని అన్నారు. కానీ, ఎమ్మెల్యేల బలం లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం.. అలా ఇస్తేనే సభకు వస్తానని చెప్పడం సరికాదన్నారు.

గతంలో ప్రతిపక్ష హోదా లేకపోయినా గౌతు లచ్చన్న (Gowthu Lachanna), అటల్ బిహారీ వాజ్‌పేయ్‌ (Atal Bihari Vajpayee)లు చట్ట సభలకు హాజరు కాలేదా అని ప్రశ్నించారు. 2019లో టీడీపీకి 23 సీట్లే వచ్చినా.. చంద్రబాబు ప్రజల అభ్యున్నతి కోసం అసెంబ్లీకీ వచ్చారని గుర్తు చేశారు. జగన్ అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్‌మీట్‌లో మాట్లాడతామనడం సంమంజసం కాదన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సరైన వేదిక అసెంబ్లీ అని విషయాన్ని గుర్తించాలన్నారు. జగన్‌కు రాజకీయ పరిణితి లేకనే సభకు హాజరుకావడం లేదని తెలిపారు. చట్ట సభలను గౌరవించి ఆయన అసెంబ్లీకి హాజరుకావాలని మరోసారి కోరుతున్నానని అన్నారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోతే తామే విపక్ష పోషిస్తామని పల్లా శ్రీనివాస రావు స్పష్టం చేశారు.

Next Story