TSPSC అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌‌గా జగదీశ్వర్ రెడ్డి

by Satheesh |

టీఎస్పీఎస్సీ ‘అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌’గా డిప్యూటీ కలెక్టర్ ఎన్ జగదీశ్వర్ రెడ్డిని నియమించారు.

TSPSC అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌‌గా జగదీశ్వర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ ‘అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌’గా డిప్యూటీ కలెక్టర్ ఎన్ జగదీశ్వర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఏసీఈగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీలో ఓఎస్‌డీగా పనిచేస్తున్నారు. డిప్యూటేషన్‌పై వచ్చిన జగదీశ్వర్ రెడ్డి రెండేళ్లు టీఎస్పీఎస్సీలో కొనసాగనున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కమిషన్‌ను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది.

Next Story