నిన్న చేసింది నిసరన మాత్రమే.. మేము దాడిచేస్తే వేరే ఉంటది: మీడియాకు జగదీష్ రెడ్డి హెచ్చరిక

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-29 08:07:02  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కేటీఆర్ తప్పుడు కథనాలు వేస్తున్నారని పలువురు బీఆర్ఎస్(BRS) నేతలు శనివారం హైదరాబాద్‌లోని మహా న్యూస్ ఆఫీస్‌పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

నిన్న చేసింది నిసరన మాత్రమే.. మేము దాడిచేస్తే వేరే ఉంటది: మీడియాకు జగదీష్ రెడ్డి హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్/సూర్యాపేట: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కేటీఆర్ తప్పుడు కథనాలు వేస్తున్నారని పలువురు బీఆర్ఎస్(BRS) నేతలు శనివారం హైదరాబాద్‌లోని మహా న్యూస్ ఆఫీస్‌పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా అనేక మంది ఖండించారు. తాజాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి(Jagadish Reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఎల్లో మీడియాను కేసీఆర్ క్షమించినా మేము వదిలిపెట్టబోమని హెచ్చరించారు. నిన్న మహా న్యూస్ ఛానల్ మీద జరిగింది దాడి కాదు.. కేవలం నిరసన మాత్రమే.. మేము దాడిచేస్తే పరిస్థితులు వేరేలా ఉంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మరో రెండు, మూడు మీడియా సంస్థలు ఉన్నాయి. వాటి సంగతి కూడా త్వరలోనే చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు ఏ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘మీ బలుపు ఏంది.. మీ అహంకారం ఏంది. ఎవడ్ని చూసుకొని మీకు ఈ బలుపు. దాడి చేయలేరు అనుకోకండి.. మా సహనాన్ని పరీక్షించకండి. మీడియా ముసుగులో కొంతమంది స్లాటర్ హౌస్‌లు నడుపుతున్నారు. ఏడాదిన్నరగా మీడియాని అడ్డం పెట్టుకుని కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నారు. ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. చంద్రబాబు, రేవంత్‌ను చూసి మురుస్తున్న వారిని భవిష్యత్తులో ఎవ్వరూ కాపాడలేరు’ అని జగదీష్ రెడ్డి మీడియాకు వార్నింగ్ ఇచ్చారు.

Next Story