జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ అక్రమం : దాసోజు శ్రవణ్

by Muthe.Rajitha |

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని మొత్తం బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం పూర్తిగా అక్రమం, అన్యాయమైన నిర్ణయమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ అక్రమం : దాసోజు శ్రవణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని మొత్తం బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం పూర్తిగా అక్రమం, అన్యాయమైన నిర్ణయమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసెంబ్లీ బిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించడమే కాకుండా, ప్రతిపక్ష స్వరాలను నిర్బంధించే, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ధోరణిగా కనిపిస్తున్నదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలోని అధికార పార్టీ ప్రతిపక్షం మాట వినకుండా, విమర్శలను అణచివేసే తలంపుతో వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. అసెంబ్లీ అంటే ప్రజల సమస్యలపై చర్చించి, పరిష్కార మార్గాలు కనుగొనే ప్లాట్‌ఫాం అని.. కానీ ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే ప్రతిపక్ష స్వరాలను మూయించడానికి ఒక సాధనంగా మారిందని విమర్శించారు.

Next Story