- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వానికి సీరియస్‌నెస్ లేదు.. జగదీశ్ రెడ్డి ఫైర్
గోదావరి నీళ్లను తరలించి ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణను ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి నీళ్లను తరలించి ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణను ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి, బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వానికి సీరియస్‌నెస్ లేకుండా పోయిందన్నారు. కేబినెట్‌లో ఈ ప్రాజెక్టుపై సీరియస్ చర్చ జరగలేదన్నారు. కృష్ణా నది నీళ్ల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని.. గోదావరిలోనూ అన్యాయం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. గోదావరి, బనకచర్లపై అన్ని పార్టీలు ఏకం కావాలని కోరారు. చంద్రబాబు నాయుడును చర్చలకు పిలవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పనికిమాలిన చర్య అని అన్నారు. వెంటనే అపెక్స్ కౌన్సిల్ నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని అన్నారు. చంద్రబాబుతో చర్చలు చేస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. గోదావరి నదీ జలాలు తెలంగాణ బతుకుదెరువు అంశమని.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు సరైన మార్గంలో లేవని ఆరోపించారు. గోదావరి, కావేరి లింక్ అని చంద్రబాబు నాయుడు చెప్పడం పెద్ద మోసమని.. గోదావరి, కావేరి లింక్‌పై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎప్పుడో అభ్యంతరం చెప్పిందని తెలిపారు.
బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు గోదావరి జలాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. త్వరలోనే గోదావరి ట్రిబ్యునల్ వచ్చే అవకాశం ఉందని.. అది రాకముందే 200 టీఎంసీలకు హక్కు కల్పించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి నీళ్లు దొరకుండా రూ.80వేల కోట్లతో చంద్రబాబు నీళ్లను తీసుకువెళ్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓట్లు వేయలేదా అని నిలదీశారు. ప్రభుత్వం కార్యాచరణ తీసుకోకుంటే ప్రజలను కలుపుకుని పోరాడుతామని చెప్పారు. రైతు సంబురాలు చేసుకోవడానికి ప్రభుత్వానికి సిగ్గనిపించడం లేదా అని నిలదీశారు. రైతులు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి సోదరులకు సహాయం చేయడమా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్.భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.






