- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS: రాహుల్ గాంధీకి ప్రజలు శిక్షలు వేస్తూనే ఉన్నారు..
by Gantepaka Srikanth |
BRS: రాహుల్ గాంధీకి ప్రజలు శిక్షలు వేస్తూనే ఉన్నారు..

X
దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్ రెడ్డి సీఎం కావడం రాష్ట్ర ప్రజల కర్మ అని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. హిల్ట్ కుంభకోణం బయటకు వచ్చిందని ఫ్రస్ట్రేషన్‌కు పోయి సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు ప్రజలు శిక్ష వేశారని రేవంత్ అంటున్నారని.. రాజకీయలు గెలుపోటములు శిక్ష అయితే.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ప్రజలు శిక్షలు వేస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో నల్గొండకు ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్ఎల్‌బీసీలో 8 మంది చనిపోతే ఇప్పటివరకు వారి శవాలు తీయలేని దద్దమ్మ రేవంత్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 10 వేల మంది ఉపాధి ఇచ్చామని తెలిపారు.
Next Story






