- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్ ఒక్కడికే కాదు.. ఆ ఇద్దరి టార్గెట్ కూడా కేసీఆరే.. జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రైతులకు కనీసం యూరియా సరఫరా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది, రేవంత్ రెడ్డి కేసులు, కమీషన్లు అంటూ డ్రామాలు చేస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల కంటే కేసీఆర్‌ను ఎక్కువగా తలుచుకునే రేవంత్ రెడ్డే అని విమర్శించారు. బడి పిల్లల ముందు కూడా కేసీఆర్ మీద చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ పేరు తలచుకుంటేనే ఆయనకి నిద్ర పడుతుందని ఎద్దేవా చేశారు. ఇవాళ కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద జరుగుతున్న కుట్రల వెనుక సీఎం రేవంత్ ఒక్కడే కాదు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu), ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కూడా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మానసికంగా దెబ్బతీసి రాజకీయంగా వాడుకోవాలనేది వారి ఉద్దేశం అని అన్నారు. కేసీఆర్ మళ్ళీ గెలిస్తే దేశంలో కీలకంగా మారుతాడనే భయం అందరిలోనూ మొదలైందని చెప్పుకొచ్చారు.






