Jagadish Reddy: లక్ష ఆరోపణల్లో ఒక్కటైనా నిరూపించగలిగారా?

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ పార్టీ నాయకుల బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బీఆర్ఎస్ తలొగ్గదని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు.

Jagadish Reddy: లక్ష ఆరోపణల్లో ఒక్కటైనా నిరూపించగలిగారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ నాయకుల బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బీఆర్ఎస్ తలొగ్గదని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం అసెంబ్లీ మీడియా హాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇల్లీగల్ క్రషర్‌పై విచారణ చేయాల్సిందేని అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన లక్ష ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిరూపించలేకపోయారన్నారు. అంతేకాకుండా.. శాసనసభలో తమ నాయకులపై ఎదురుదాడి చేశారని అన్నారు. తాము హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తే.. సీబీసీఐడీ విచారణ పేరుతో ప్రభుత్వం కుక్క బెదిరింపులు చేస్తున్నదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కొత్త, పాత బాస్‌ల కుట్రలను కేసీఆర్ నాయకత్వంలో ఎదుర్కొన్నామని.. నాడు కేసీఆర్‌ను టార్గెట్ చేస్తే నేడు కేటీఆర్‌ను టార్గెట్ చేశారని ఆరోపించారు. శాసనసభలో సీపీఐ, బీజేపీ, కాంగ్రెస్ అంతా ఒక్కటేనని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పట్టపగలు రూ.50 లక్షల బ్యాగ్‌తో దొరికినట్లు, పొంగులేటి ఆధారాలతో దొరికిపోయారని పేర్కొన్నారు. దొంగతనం చేసిన దొంగ మీద విచారణ చేయకుండా, పట్టుకున్న పోలీసు మీద విచారణ చేసినట్లుంది కథ అని ఎద్దేవా చేశారు.

Next Story