- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మీరు దొరికిపోయారు.. ఇక తప్పించుకునే ప్రయత్నం చేయకండి’: ఎమ్మెల్యేలకు జగదీష్ రెడ్డి సూచన
అసెంబ్లీ(Telangana Assembly) సహాయ కార్యదర్శిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు.

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ(Telangana Assembly) సహాయ కార్యదర్శిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో సోమవారం అసెంబ్లీ సహాయ కార్యదర్శికి ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై వివరణ ఇచ్చారు. తమ సమాధానాలు అసెంబ్లీ సహాయ కార్యదర్శికి జగదీష్‌రెడ్డి, వివేకానంద గౌడ్, ప్రభాకర్‌లు అందజేశారు. అనంతరం జగదీష్ రెడ్డి(Jagadish Reddy) మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అమాయాకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాల్లో పదిమంది ఎమ్మెల్యేలు పాల్గొంటూనే.. మేము కాంగ్రెస్‌లో చేరలేదు.. బీఆర్ఎస్‌కు రిజైన్ చేయలేదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం అని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారని జగదీష్ రెడ్డి గుర్తుచేశారు.
పోచారం మాటలను ఏఐ ద్వారా ఏమైనా మార్ఫింగ్ చేశారా? అని ప్రశ్నించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేసీఆర్‌పై నమ్మకం ఉంటే ఇంట్లో కేసీఆర్ ఫొటో, మెడలో బీఆర్ఎస్ కండువా ఉండాలని కదా అని అడిగారు. అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. రాహుల్ గాందీ, మహేశ్ కుమార్ గౌడ్‌ను ఎందుకు కలిశారని అడిగారు. ఇలాలే నవ్వొచ్చే వివరణ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా ఇచ్చాడని ఎద్దేవా చేశారు. ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే.. సడన్‌గా మెడలో కండువా వేశారని చెబుతున్నారని విమర్శించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
పార్టీ మారి తప్పు చేశామని ఆ పది మంది బహిరంగంగా ఒప్పుకోవాలి. లేదంటే పార్టీ మారలేదని కేసీఆర్ దగ్గర పిటిషన్ పెట్టుకోండి అని జగదీష్ రెడ్డి సూచించారు. నోటీసులు వచ్చాక కేసీఆర్ దగ్గరకు రావాల్సిన పదిమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి దగ్గరకు ఎందుకు వెళ్లారు? అని అన్నారు. ఎన్ని చేసినా పదిమంది ఎమ్మెల్యేలు తప్పించుకోలేరు. వీళ్లంతా దొరికిపోయిన దొంగలు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయారు. వందకు వందశాతం శిక్షార్హులు. కోర్టుముందు తప్పించుకోలేరు. ఉప ఎన్నికలు రావడం ఖాయం. ప్రజలు వారికి కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయమని జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.






