- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అజ్ఞానులు, మూర్ఖుల చేతిలో తెలంగాణ: మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వానికి పాలన ఎలా చేయాలో తెలియడం లేదని, ప్రజా సమస్యలను పక్క దారి పట్టించే విషయాలపై దృష్టి పెట్టిందని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వానికి పాలన ఎలా చేయాలో తెలియడం లేదని, ప్రజా సమస్యలను పక్క దారి పట్టించే విషయాలపై దృష్టి పెట్టిందని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ హాయంలో కేబినెట్ సమావేశంలో నిర్ణయాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసే వారని, ఈప్రభుత్వం ప్రజల సమస్యల గురించి ఆలోచన చేయడం లేదని మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సీబీఐ విచారణకు కేబినెట్ తీర్మానిస్తూ పిచ్చి నిర్ణయం తీసుకుందని, రాహుల్ గాంధీ సీబీఐని మోడీ జేబు సంస్థ అని గొప్పలు పలికి అదే సీబీఐకి దర్యాప్తు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఈనిర్ణయం మోడీ కాళ్ళ మీద పడటం తప్ప మరొకటి కాదని, కాంగ్రెస్ పార్టీని రేవంత్ ఏం చేస్తున్నారో రాహుల్ ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు. తెలంగాణ పోలీసుల మీద పాలకులకు నమ్మకం లేదా,వాళ్ళు చేతకాని వారో చెప్పాలన్నారు. అసలు విద్యుత్ కొనుగోళ్లపై మదన్ బీ లోకూర్ ఎప్పుడు విచారణ జరిపారని, విచారణ జరిపి కమిషన్ రిపోర్టు ఇస్తే అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదన్నారు. ఈ కమిషన్ రిపోర్ట్ కాళేశ్వరం రిపోర్టుకు ముందు ఇచ్చారా తర్వాత ఇచ్చారా, మదన్ లోకూర్ ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టినట్లు మా దగ్గర సమాచారం ఉందన్నారు.
కేసీఆర్‌ను ఎన్ని విచారణలు వేసిన భయపడే ప్రసక్తిలేదని, ఆయన ఇచ్చిన 24 గంటల కరెంటును సరిగా కొనసాగించని పాలకులు నేటి కాంగ్రెస్ నేతలు అంటూ విరుచుక పడ్డారు. ప్రభుత్వాన్ని సరిగా నడపలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విచారణ చేయాలని, రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం లోపే కరెంటు పరిస్థితిని కేసీఆర్ చక్కదిద్దారు. గ్రామాల్లో ,హైదరాబాద్ లో కరెంటు కోతలు ఉన్నాయని, దీనిపై ఏ మంత్రి అయిన నాతో చర్చకు వస్తే నిరూపిస్తానని సవాల్‌విసిరారు. కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వచ్చినట్టే ఎన్ని విచారణలు జరిగినా కేసీఆర్ కడిగిన ముత్యంలా బయట పడుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ అంటూ వేస్తున్న విచారణలపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు సమాధానం చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇది రాహుల్ డైరెక్షన్‌లో నడుస్తున్న ప్రభుత్వమా, మోడీ నడుపుతున్న ప్రభుత్వమా ఆలోచించాలని సూచించారు.






