- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదే పదే చంద్రబాబు ఆ మాట అంటుంటే నవ్వొస్తుంది.. జగదీశ్ రెడ్డి సెటైర్
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project) వల్ల ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేదు.

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project) వల్ల ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. సముద్రంలో కలిసే నీళ్లను పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తరలిస్తాం. కావాలనే ఈ ప్రాజెక్టులపై బీఆర్ఎస్(BRS) తప్పుడు ప్రచారం చేస్తోందని మహానాడు సభలో సీఎం చంద్రబాబు(Chandrabu) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబుకు వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆంధ్రాలో జరుపుకుంటున్న మహానాడులో తెలంగాణ ముచ్చటెందుకు వచ్చిందని అడిగారు. 2004తోనే తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసింది. అయినా పదే పదే హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశాను అని చంద్రబాబు చెప్పుకుంటుంటే నవ్వొస్తోందని సెటైర్ వేశారు. 2004లో సమైక్య ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 26 వేల కోట్ల లోపే ఉండేదని గుర్తుచేశారు.
‘2014 నుంచి ఆంధ్రాలో మీ ఐదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఒక్కసారి గుర్తుచేసుకో. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. అన్ని రంగాలు అభివృద్ధిలో దూసుకుపోయాయి. ప్రత్యేక రాష్టంగా ఏర్పడ్డ నాడు తెలంగాణాలో 1.12 లక్షల తలసరి ఆదాయముంటే.. కేసీఆర్(KCR) పాలనలో 3.70 లక్షలకు చేరింది. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయ 2.50 లక్షలు మాత్రమే ఉంది. నిజంగా మీ పరిపాలన గొప్పదే అయితే ఏపీ ఆదాయం ఎందుకు పెరుగుతలేదు. చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలి’ అని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.






