హెలికాప్టర్ లేకపోతే మంత్రి ఉత్తమ్ కాలు కదపడం లేదు: జగదీష్ రెడ్డి సెటైర్

by Gantepaka Srikanth |

ఉమ్మడి నల్లగొండలో జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు మిల్లర్లుతో కుమ్మకై రైతులను దోచుకుంటున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

హెలికాప్టర్ లేకపోతే మంత్రి ఉత్తమ్ కాలు కదపడం లేదు: జగదీష్ రెడ్డి సెటైర్
X

దిశ నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండలో జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు మిల్లర్లుతో కుమ్మకై రైతులను దోచుకుంటున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ధాన్యం కొనుగోలు వేగం చేయాలని, తరుగు లేకుండా ధాన్యాన్ని తూకం వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ముందు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాలు, మట్టి పెడ్డలు వస్తున్నాయని పేరుతో దోపిడీ చేస్తే చెప్పులతో కొడతారని వార్నింగ్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలిక్యాప్టర్ లేక కాలు కదపడం లేదని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నాడని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్నది హైబ్రిడ్ కాంగ్రెస్ అని, ప్రధాని మోడీ, ఆంధ్రా సీఎం బాబులకు పుట్టిన కాంగ్రెస్ ప్రస్తుతం తెలంగాణను పాలిస్తుందన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు నిత్యం మనకు టచ్‌లోకి వస్తున్నారని, రానున్న కాలంలో అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుందని కాంగ్రెస్ నేతలే చెప్తున్నా విషయాన్ని సందర్భంగా గుర్తుచేశారు.

బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై రేవంత్ సర్కారం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం గుండల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్ప రైతు లేరని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రైతుల కళ్ళల్లో ఆనందభాష్పాలు వస్తే ప్రస్తుతం రైతులకు కలలు కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు జరుగుతున్న వేళ ఒక్క కొనుగోలు కేంద్రాన్ని అయినా సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారా చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు బంధు పేరుతో రైతులకు 70 వేల కోట్ల బడ్జెట్లు అందజేసిన ఘనత కేసీఆర్ అన్నారు. ఆయన దృష్టి అంతా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం పైనే ఉందని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ తొమ్మిది రోజులు సేమ్ రేవంత్ రెడ్డి దాచి పెట్టాడని గుర్తు చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. మాజీ నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్ రవీంద్ర కుమార్, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నల్లమోతు భాస్కరరావు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Next Story