మంత్రి ఉత్తమ్‌కు బ్రెయిన్ లేదు.. జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

సభలో కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి పలకరించడం మంచి సాంప్రదాయమని జగదీశ్ రెడ్డి ప్రశంసించారు.

మంత్రి ఉత్తమ్‌కు బ్రెయిన్ లేదు.. జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌(KCR)ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు రెండ్రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారాయి. కాంగ్రెస్ నేతలు వారికి పాజిటివ్‌గా.. బీఆర్ఎస్(BRS) నేతలు వారికి పాజిటివ్‌గా ఎవరికి వారు షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్(Congress) పెయిడ్ ప్రచారం చేస్తోందని విమర్శించారు. సభలో కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి పలకరించడం మంచి సాంప్రదాయమని ప్రశంసించారు. ఎప్పుడు ఏం చేయాలో కేసీఆర్‌కు బాగా తెలుసని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలనైనా కేసీఆర్‌ కనిపిస్తే పలకరిస్తారని అన్నారు. సభ్యులు సభకు రావడం.. వెళ్లిపోవడం సాధారణం అన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు రకాలుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రూ.27 వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతూనే.. మళ్లీ బీఆర్ఎస్ ఏం చేయలేదని అంటున్నారని విమర్శలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైట్ ఉన్నారు కానీ.. బ్రెయిన్ తక్కువుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల మీద అవగాహన లేని వ్యక్తిని ఇరిగేషన్ మంత్రిని చేశారని విమర్శించారు.

Next Story