- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీవో 190 ని వెంటనే అమలు చేయండి.. డీహెచ్‌కు 317 జీవో బాధిత జేఏసీ విజ్ఞప్తి
జీవో 317 బాధితులకు న్యాయం చేస్తూ తాత్కాలికంగా వారికి డిప్యూటేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 190 ని తక్షణమే అమలు చేయాలని 317 బాధిత జేఏసీ కోరింది.

దిశ, తెలంగాణ బ్యూరో: జీవో 317 బాధితులకు న్యాయం చేస్తూ తాత్కాలికంగా వారికి డిప్యూటేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 190 ని తక్షణమే అమలు చేయాలని 317 బాధిత జేఏసీ కోరింది. గురువారం కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో డీహెచ్ రవీంద్ర నాయక్ ను కలిసి వినతిపత్రం అందించారు. 317 జీవో వల్ల ఎక్కడెక్కడికో బదిలీల్లో వెళ్లి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు పోయారు. 317 జీవో బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ప్రభుత్వం మానవత్వంతో తీసుకువచ్చిన జీవో 190 ని వెంటనే అమలు చేయాలని, డిప్యూటేషన్లు కల్పించాలని కోరారు. ఇందుకు సంబంధించిన డాటాను త్వరగా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తామని డీహెచ్ హామీ ఇచ్చారు.
అడిషనల్ డైరెక్టర్ శశిశ్రీ, జాయింట్ డైరెక్టర్ అనురాధకు వెంటనే ఆదేశాలు ఇచ్చారు. టీవీవీపీ, కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయాల్లోనూ జీవో 190 ని వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు 317 జీవో మెడికల్ అండ్ హెల్త్ విక్టిమ్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు శేఖర్ తెలిపారు. అధికారులను కలిసిన వారిలో జనరల్ సెక్రటరీ రాథోడ్ కిరణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ నెల్లి విద్యాసాగర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులున్నారు.






