Ity Pandey: దక్షిణ మధ్య రైల్వే పీసీసీఎంగా ఇతి పాండే బాధ్యతల స్వీకరణ

by Ramesh Naini |   (  Updated:2025-08-02 13:42:50  IST  )

దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌ (పీసీసీఎం)గా ఇతి పాండే నియమితులయ్యారు.

Ity Pandey: దక్షిణ మధ్య రైల్వే పీసీసీఎంగా ఇతి పాండే బాధ్యతల స్వీకరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌ (PCCM)గా ఇతి పాండే (Ity Pandey) నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రైల్ నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (IRTS) 1998 బ్యాచ్‌కు చెందిన ఇతి పాండే అలహాబాద్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ విభాగంలో గోల్డ్ మెడల్ పొందారు. భారతీయ రైల్వే లోని వేర్వేరు డివిజన్లలో ఆమె పనిచేశారు. దీనికి ముందు ఆమె భూసావాల్ డివిజన్ రైల్వే మేనేజర్‌గా పనిచేశారు. చీఫ్ కమర్షియల్ తో సహా అనేక ఉన్నత స్థాయి పదవుల్లో చేశారు. ముఖ్యంగా ఆమె మారుమూల ప్రాంతాల్లో రైల్వే కార్మికుల ప్రయోజనం కోసం మొబైల్ హాస్పిటల్ ఏర్పాటు చేయించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

Link

Next Story