గడీల్లో కూర్చొని లబ్దిదారులను ఎంపిక చేసినట్టు కాదు.. కేటీఆర్‌కు భట్టి కౌంటర్

by Ramesh Goud |

గడీల్లో కూర్చొని లబ్దిదారులను ఎంపిక చేసినట్టు కాదు కేటీఆర్.. పదేళ్లు పట్టించుకోకుండా నేడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు.

గడీల్లో కూర్చొని లబ్దిదారులను ఎంపిక చేసినట్టు కాదు.. కేటీఆర్‌కు భట్టి కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: గడీల్లో కూర్చొని లబ్దిదారులను ఎంపిక చేసినట్టు కాదు కేటీఆర్.. పదేళ్లు పట్టించుకోకుండా నేడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. సంక్షేమ పథకాల అమలు పట్ల భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పందిస్తూ.. "భట్టి గారు.. ఒక్క గ్రామంలోనే ఓట్లు అడిగారా?" అని ట్వీట్ చేశారు. దీనిపై భట్టి కౌంటర్(Counter) ఇస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. కేటీఆర్.. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి నాలుగు సంక్షేమ పథకాల మంజూరుకు ఈరోజు అంతం కాదు ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు.

అలాగే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పరమ పవిత్రమైన ఈరోజు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఒక గ్రామంలో నూరు శాతం అందిస్తూ లాంచనంగా పథకాలను ప్రారంభించామని తెలిపారు. నిధులు అందుబాటులో ఉన్న గత పదేళ్లలో మాలాగా సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేక పోయారు.? అని, దశాబ్ద కాలంగా అల్లాడిన పేద ప్రజలను పట్టించుకోకుండా.. ఒకే గ్రామంలోనే ఇస్తారా అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగకుండా చేయాలని మీరు ఎన్ని ఆటంకాలు స్పృష్టించినా.. ప్రతి పథకాన్ని సంతృప్త స్థాయి(శాచ్యురేషన్ మోడ్)లో అమలు చేస్తామని చెప్పారు.

అంతేగాక గత పది సంవత్సరాలు మీరు ప్రజలను పట్టించుకోలేదని, మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సహా రాష్ట్ర క్యాబినెట్ మొత్తం సంపద స్పృష్టిస్తున్నాం.. పేద ప్రజలకు పంచుతున్నాం అని తెలిపారు. గతంలో నాలుగు గోడల మధ్య గడిల్లో కూర్చొని లబ్ధిదారులను ఖరారు చేశారని, మేము మూడు రోజులు ప్రజల మధ్య గ్రామసభలు పెట్టి, జబితాలు ప్రకటించి, ఇంకా మిగిలిన వారు ఉంటే దరఖాస్తులు పెట్టుకోమని పిలుపునిచ్చినట్లు వివరించారు. ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితమని, నిత్యం ప్రజలకు పనికి వచ్చే నిర్ణయాలే తీసుకుంటామని భట్టి వివరణ ఇచ్చారు.

Next Story