- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భయపడటానికి ఫామ్‌హౌస్‌లో ఎలుకను కాదు.. బండి సంజయ్ హాట్ కామెంట్స్
‘జై శ్రీరామ్’ అనే నినాదంతో బెంగాల్‌లో బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు మర్చిపోవద్దని బండి సంజయ్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ‘జై శ్రీరామ్’ అనే నినాదం వింటేనే కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఇవాళ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘జై శ్రీరామ్’ అంటే కడుపు నిండుతుందా? అని కాంగ్రెస్ నేతలు హేళనగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అదే నినాదంతో బెంగాల్‌లో బీజేపీ (BJP) ప్రభుత్వం ఏర్పడిందనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు మర్చిపోవద్దు. తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల్లో పక్కాగా అధికారంలోకి వస్తాం. సనాతన ధర్మం కోసం మేము నిరంతరం పనిచేస్తాం.. మా ధర్మాన్ని కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
గ్యారంటీలపై నిలదీత..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు (Six Guarantees) ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ నేతలకు కీలక సూచన చేశారు. నాయకులు తమ మధ్య ఉన్న అభిప్రాయభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ.. ‘బీజేపీ కార్యకర్తను అయినందుకు నేను ఎంతగానో గర్వపడుతున్నాను. పార్టీ తల వంచుకునే పని నేను ఎప్పుడూ చేయలేదు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. బెదిరింపులకు భయపడటానికి నేనేమీ ఫామ్‌హౌస్‌లో దాక్కునే ఎలుకను కాదు’ అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.






