పన్ను మినహాయింపు అనడం సిగ్గుచేటు.. బడ్జెట్ పై కాంగ్రెస్ నేత హాట్ కామెంట్స్

by Ramesh Goud |

బీజేపీ ప్రభుత్వం (BJP Government) సంక్షేమ రాజ్యంగా ఉన్న దేశాన్ని పన్నుల రాజ్యంగా మార్చిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి (TPCC General Secretary) అద్దంకి దయాకర్ (Addanki Dayakar) అన్నారు.

పన్ను మినహాయింపు అనడం సిగ్గుచేటు.. బడ్జెట్ పై కాంగ్రెస్ నేత హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ప్రభుత్వం (BJP Government) సంక్షేమ రాజ్యంగా ఉన్న దేశాన్ని పన్నుల రాజ్యంగా మార్చిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి (TPCC General Secretary) అద్దంకి దయాకర్ (Addanki Dayakar) అన్నారు. శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) 2025-26 సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ (Union Budjet) ను ప్రవేశ పెట్టారు. దీనిపై కాంగ్రెస్ నేతలు (Congress leader) సహా పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పింస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ పై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ రాజ్యాన్ని పన్నుల రాజ్యంగా మార్చి, దేశాన్ని ఉద్దరిస్తున్నట్లుగా ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీని (BJP) చూస్తే నవ్వు వస్తున్నదని ఎద్దేవా చేశారు.

ఆదాయపు పన్ను కట్టే రెండు, మూడు కోట్ల మందికి సంబంధించిన అంశాన్ని తెర మీదకి తెచ్చి, పన్ను మినహాయింపుతో గొప్ప మార్పులు చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఒకవైపు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ వైపు తీసుకెళుతున్నామని చెబుతూనే.. కనీసం పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గించలేని దుస్థితిని తీసుకొచ్చిందని మండిపడ్డారు. వ్యవసాయాన్ని పెద్ద పీట వేస్తున్నామని అంటున్నారు కానీ హోంశాఖకు కేటాయించిన బడ్జెట్ కూడా కేటాయించకపోవడం చూస్తుంటే, ఏపాటి పెద్ద పీట వేస్తున్నారో అర్థం అవుతుందన్నారు. అంతేగాక కార్పోరేట్ (Corporates) శక్తులకు కొమ్ము కాసే విధంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉన్నదని, బడ్జెట్ ను ప్రచార అస్త్రంగా మార్చుకోవడం సిగ్గు చేటన్నారు.

దేశంలోని 145 కోట్ల మంది జనాభాను టాక్స్ పరిధిలోకి తెచ్చి, లక్షల కోట్ల ప్రజల సంపదను ప్రైవేట్ కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతూ దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 2025 అతిపెద్ద ఆర్థిక మాంద్య సంవత్సరంగా సోషల్ సైటిస్టులు చెప్తుంటే.. దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదని విమర్శలు చేశారు. తలసరి ఆదాయం తగ్గుతుంటే, కొనుగోలు శక్తి తగ్గుతుందని, కొంత మందిని తెరపైకి తీసుకొచ్చి పన్ను మినహాయింపు ఇస్తున్నాం అనడం సరికాదన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైన ప్రజా అభివృద్ధి మీద దృష్టి సారిస్తే మంచిదని అద్దంకి సూచించారు.

Next Story