- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆశావహులకు ఇక పండగే.. 29న స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల!
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెడీ అవుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెడీ అవుతున్నది. అవసరమైన ఏర్పాట్లపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమావేశం అవుతుంది. ఈనెల 29న స్థానిక ఎన్నికల షెడ్యూల్‌విడుదల చేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని శుక్రవారం డీజీపీ జితేందర్‌తో సమావేశమయ్యారు. శాంతి భద్రతలు, బందోబస్తు, సున్నిత ప్రాంతాలపై చర్చించారు. అవసరమైన సిబ్బంది, ప్రస్తుతం ఎంత మంది అందుబాటులో ఉన్నారు వంటి విషయాలు డీజీపీని అడిగి తెలుసుకున్నారు.
నేడు రానున్న స్పష్టత
మసాబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో ఎన్నికల కమిషనర్రాణికుముదిని నేడు సమావేశం కానున్నారు. ఈ భేటిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్సుల్తానీయా, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, పంచాయతీరాజ్కమిషనర్శ్రీజన, ప్రింటింగ్ప్రెస్సెక్రెటరీ హాజరుకానున్నారు. వీరితో మాట్లాడి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తెలుసుకోనున్నారు. ఇందులోనే ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై స్పష్టత రానుంది.
ఆర్‌వోలు, ఏఆర్‌వోలకు శిక్షణ
జిల్లా స్థాయిలో ఎన్నికల నిర్వహణలో కీలకమైన ఎన్నికల రిటర్నింగ్అధికారులు (ఆర్‌వో), అసిస్టెంట్రిటర్నింగ్అధికారులు(ఏఆర్‌వో)లకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఆర్‌వోలకు శిక్షణ ఇచ్చారు. ఇందులో కొందరు మార్పులు చేసుకోవడంతో కొత్త వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీసు శాఖలు తీవ్ర హడావుడి, ఒత్తిడిలో ఉన్నాయి. తక్కువ సిబ్బంది ఉండటంతో ఇబ్బందులు తప్పవనే అభిప్రాయంలో ఉన్నారు.






