రైతులు ఏఐ టెక్నాలజీ వినియోగిస్తే ఎంతో మేలు.. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

by Kema Shiva Kumar |

రైతులు ఏఐ టెక్నాలజీ వినియోగిస్తే విలువైన సమయం ఆదాతో పాటు తమ పంటలకు ఖచ్చితమైన నివారణ చర్యలు తీసుకునే వీలుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

రైతులు ఏఐ టెక్నాలజీ వినియోగిస్తే ఎంతో మేలు.. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులు ఏఐ టెక్నాలజీ వినియోగిస్తే విలువైన సమయం ఆదాతో పాటు తమ పంటలకు ఖచ్చితమైన నివారణ చర్యలు తీసుకునే వీలుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. రైతులందరూ తప్పనిసరిగా ఏఐ టెక్నాలజీని వినియోగించుకోవాలని కోరారు. ఇక్రిశాట్ వారితో సమన్వయం చేసుకోవాలని కృషి వాస్​సంస్థకు సూచించారు. శనివారం ఆసంస్థ ప్రతినిధులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆసంస్ధ నిర్వహకులు తయారు చేసిన ఏఐ టెక్నాలజీతో శాటిలైట్ ఇమెజింగ్ ద్వారా ముందస్తుగానే పంటలకు వచ్చే చీడ పురుగులు, రసం పీల్చే పురుగులను గుర్తించి, వాటిని మొదట్లోనే నిరోధించే విధంగా టెక్నాలజీ గురించి మంత్రికి వివరించారు.

పంట బయటకు కనిపించే వాటినే కాకుండా పంట అంతర్గతంగా ఉన్న రోగాన్ని కూడా గుర్తించి దానికి నివారణ చర్యలు కూడా సిఫారసు చేస్తుంది. దీని ద్వారా వాటికి కావాల్సిన నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. పొలంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ మొక్కకు తెగులు సోకిందో ముందుగానే గుర్తించి దానికి పిచికారి చేయాల్సిన మందును కూడా చెబుతుందన్నారు. దీంతో సంబందిత రైతు ఆ పంటకు పిచికారి చేసి పంటలను సరైన సమయానికి సంరక్షించుకోవచ్చని, అసలు పొలం దగ్గరకి పోకుండా కూడా ఈ యాప్ ద్వారా పంట స్థితిగతులను తెలుసుకోవచ్చని వారు పేర్కొన్నారు. రైతుపంట ఎంత వేశారు, ఎన్ని ఎకరాలలో వేశారు, అన్న డేటా కూడా సరైన సమయంలో వ్యవసాయ అధికారులకు లభిస్తుందని అన్నారు.

ఎక్కడైతే తెగుళ్లు ఏర్పడుతుందో, దానినే ముందుగా గుర్తించి, నివారణ దిశగా చర్యలు తీసుకోవడంతో రైతులకు మిగతా పొలానికి తెగులు ఏర్పడకుండా నివారించి, తక్కువ కూలీ ఖర్చుతో, అధిక దిగుబడి పొందే అవకాశం కలుగుతుందని అన్నారు. అంతేకాకుండా ఏఐ యాప్ ద్వారా మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ముందస్తు సమాచారం, సమస్యను గుర్తించడం, సమస్య చోటులోనే స్ప్రే చేయడం, వాతావరణ హెచ్చరికలు, నేల, ఆకు తేమ సమాచారం, ఆయిల్‌పామ్‌లో ప్రతి చెట్టు‌కు రియల్ టైం సమాచారం ఇస్తుందన్నారు. ఈ ఏఐ యాప్ ద్వారా 60కు పైగా పంటలను పరీక్షించించే విధంగా అవకాశం ఉంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, కృషి వికాస్ వెబ్‌సైట్లలో యాప్ అందుబాటులో ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Next Story