- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్తేనే మంచిది.. CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ల జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు (High Court) ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ల జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు (High Court) ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే అంశంపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లుగా సమాచారం. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరనున్నారు. మరోవైపు ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని తెలంగాణ సర్కార్ అత్యున్నత న్యాయస్థానంలో గట్టిగా వాదనలు వినిపించనుంది.
ఈ క్రమంలోనే తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నిర్వహణపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Lakshmi Narayana) స్పందించారు. రిజర్వేషన్ల విషయంలో 50 శాతానికి మించి ముందుకు వెళ్తే దేశంలోని ఏ కోర్టు అయినా అడ్డుపడుతుందని అన్నారు. రాజ్యాంగం, దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలను అధిగమించితే తప్పులు దోర్లే అవకాశం ఉందని కామెంట్ చేశారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మంచిదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరింత ఆలస్యం చేస్తే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.






