- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిజర్వేషన్లపై బీఆర్ఎస్ రాజకీయాలు మానేస్తే మంచిది : కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి
బీసీల రిజర్వేషన్ల(BC Reservations) అంశంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం మానుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవం రెడ్డి(Jeevan Reddy) సూచించారు.

దిశ, వెబ్ డెస్క్ : బీసీల రిజర్వేషన్ల(BC Reservations) అంశంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం మానుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవం రెడ్డి(Jeevan Reddy) సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయంపై బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) పార్టీలు రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ అంశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని తీవ్రంగా విమర్శించారు. ఈ రిజర్వేషన్ బిల్లు అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో శాసనసభలో ఆమోదం పొందిందని, దీనిని 9వ షెడ్యూల్‌లో చేర్చడంలో నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. ఈ బిల్లు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మార్చి 2025లో శాసనసభలో ఆమోదం పొందినట్లు ఆయన తెలిపారు.
అలాగే, 4 శాతం రిజర్వేషన్లు పొందలేని వారు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటాకు అర్హులవుతారని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయ, మతపరమైన వివాదాలు సృష్టించడం అనవసరమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను అమలు చేయడానికి పంచాయతీరాజ్ చట్టం-2018లో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది. దీనిపై బీసీ కమిషన్ మేధావులతో చర్చలు జరిపి న్యాయపరమైన సవాళ్లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోందని సమాచారం. జీవన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక చర్యగా అభివర్ణిస్తూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దీనిపై విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.






