30 నెలల్లో పూర్తి చేస్తామన్నారు.. పదేళ్లైనా చుక్కనీరు ఇవ్వలేదు.. కేసీఆర్ ప్రభుత్వంపై కవిత ఎటాక్

by Prasad Jukanti |   (  Updated:2026-05-15 12:31:16  IST  )

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

30 నెలల్లో పూర్తి చేస్తామన్నారు.. పదేళ్లైనా చుక్కనీరు ఇవ్వలేదు.. కేసీఆర్ ప్రభుత్వంపై కవిత ఎటాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులపై రూ. 1.21 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఎందుకు నీళ్లు రాలేదని ప్రశ్నించారు. ఇవాళ ఓ మీడియా సంస్థ నిర్వహించిన కాన్క్లేవ్‌ మాట్లాడిన కవిత... పాలమూరు-రంగారెడ్డిని 30 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి పదేళ్లైనా చుక్కనీరు ఇవ్వలేకపోయారని దుయ్యబట్టారు. రూ.32వేల కోట్ల అంచనాలతో మొదలైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంచనాలు ఇప్పుడు రూ.80వేల కోట్లకు పెరిగాయన్నారు. నీటి వినియోగంలో తెలంగాణ ప్రభుత్వాలు విఫలం అయ్యాయన్నారు. 35 లక్షల ఎకరాలతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణలోనే అత్యంత పెద్ జిల్లా కానీ ఈ జిల్లా నుంచి ఇప్పటికీ వలసలు ఉన్నాయని రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు అవుతున్నా వలసలు ఆగలేదని ఈ పరిస్థితి మారాలన్నారు.

మార్పులు రాజకీయాలతోనే:

ఈ దేశంలో ఏ మార్పు వచ్చిన అది రాజకీయంగానే వచ్చిందని ఈ దేశంలోని అన్ని సమస్యలపై స్పందించేది కేవలం ఒక రాజకీయనాయకులు మాత్రమేనన్నారు. నేపాల్ లో జెన్ జీ ప్రభుత్వాన్నే మార్చివేశారని కానీ మన దేశంలో మన పిల్లలను రాజకీయానికి దూరంగా ఉంచుతున్నామన్నారు. మాతో కలిసి కలవండి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కవిత.. వీళ్లు ఎప్పటి నుంచో కలిసి ఉన్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సీఎం అని ఇప్పిటకే చెప్పామన్నారు. రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు రాకపోయిన కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు అడగడం లేదున్నారు.

కేసీఆర్ పై కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

Next Story