నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం : ఎమ్మెల్యే మల్ రెడ్డి

by Naga Rani Yarlagadda |

మంత్రి పదవిపైన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర కామెంట్లు చేశారు. రెండు కోట్ల మంది ప్రజలు ఉన్న జిల్లాకు ఇంత వరకు మంత్రి పదవి ఇవ్వలేదు..

నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం : ఎమ్మెల్యే మల్ రెడ్డి
X
  • రెండు కోట్ల జనాభా ఉన్న పెద్ద జిల్లాకు ఇంత వరకు మంత్రి పదవి ఇవ్వలేదు.. పార్టీ పెద్దలు ఆలోచించాలి
  • కవిత కాంగ్రెస్ లో చేరినా ఆశ్చర్యపోనక్కరలేదు
  • మీడియాతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చిట్ చాట్

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి పదవిపైన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర కామెంట్లు చేశారు. రెండు కోట్ల మంది ప్రజలు ఉన్న జిల్లాకు ఇంత వరకు మంత్రి పదవి ఇవ్వలేదు.. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం.. నాకు నష్టం లేదు.. పార్టీ పెద్దలు ఆలోచించాలని మల్ రెడ్డి రంగారెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానమే అని, రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చు. కానీ.. జిల్లా స్వరూపం మారొద్దన్నారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో రియల్ భూమ్ పెరిగింది. భూముల రేట్లు పెరుగుతున్నా.. ఎవరూ అమ్మడం లేదని మల్ రెడ్డి రంగారెడ్డి చెప్పారు. ఫార్మాసిటీపై పోరాటం చేసినందుకే గతంలో నన్ను కేసీఆర్ ఓడగొట్టాడు. ఫార్మాసిటీ వచ్చి ఉంటే 50 కిలోమీటర్ల మేర పొల్యూషన్ అయ్యేదని ఆయన తెలిపారు. కవిత కూడా కాంగ్రెస్ లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నకు మల్ రెడ్డి రంగారెడ్డి సమాధానమిచ్చారు.

Next Story