- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పని చేసింది కాంగ్రెస్‌లోని కోవర్టులే.. బాబా ఫసీయుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) అనుచరుల నుంచి తనకు ప్రాణహానీ ఉందని కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ (Baba Fasiuddin) సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) అనుచరుల నుంచి తనకు ప్రాణహానీ ఉందని కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ (Baba Fasiuddin) సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఇటీవల ఓ అజ్ఞాత వ్యక్తి రాసిన లేఖపై కూడా ఆయన స్పందించారు. ఈ క్రమంలోనే ఇవాళ బాబా ఫసియుద్దీన్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav)కు 50 వేల మెజారిటీ రావాల్సిందని కామెంట్ చేశారు. పెద్ద మొత్తంలో మెజారిటీ రాకుండా అడ్డుకుంది కాంగ్రెస్‌లోనే కొందరు కోవర్టులేనని ఆయన బాంబు పేల్చారు. ముఖ్యంగా మాగంటి అనుచరులతో ప్రాణహానీ ఉందని.. తన కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలన్నారు. అజ్ఞాత వ్యక్తి రాసిన లేఖపై డీజీపీ (DGP)కి ఫిర్యాదు చేశానని తెలిపారు. ఎవడో ఆర్ధిక ఇబ్బందులు, అక్రమ సంబంధాలు, పనికిరాని వ్యవహరాలు పెట్టుకుని చనిపోతే అది కూడా తనపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని బాబా ఫసియుద్దీన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.






