చంద్రబాబును అరెస్ట్ చేయించింది బీజేపీనే.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
చంద్రబాబును అరెస్ట్ చేయించింది బీజేపీనే.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించింది బీజేపీ ప్రభుత్వమే అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణగూడ వైఎంసీఏ సిగ్నల్ వద్ద షోయబుల్లాఖాన్ చిత్ర పటానికి నారాయణ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అండ దండలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం ఏపీ సీఎం జగన్‌కు సాధ్యం కాదని చెప్పారు.

టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారని, దీంతో వస్తే రండి లేకపోతే లేదని బీజేపీకి పవన్ కళ్యాణ్ చెప్పినట్టే కదా అని అభిప్రాయపడ్డారు. ఎంఐఎం పార్టీకి అన్ని పార్టీలు భయపడినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భయపడుతుందని విమర్శించారు. అందుకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, పోరాటంలో పాల్గొన్న పోరాట యోధులను గుర్తించడం లేదని మండిపడ్డారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సాయుధ పోరాటంను అధికారికంగా చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం కూడా రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు చేయాలని, తెలంగాణ ప్రెస్ అకాడమీకి షోయబుల్లాఖాన్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed