Hyderabad: న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కలకలం!

by velandi.Saikiran |

న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కలకలం. ఇల్యూషన్ పబ్ లో డీజే ఆర్టిస్ట్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.

Hyderabad: న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కలకలం!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: న్యూ ఇయర్ వేడుకలు హైదరాబాద్ నగరవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా జరిగాయి. దీంతో హైదరాబాద్ నగరంలో ఉన్న పబ్బులు, బార్లు, క్లబ్బులు కళకళలాడాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ న్యూ ఇయర్ వేడుకలలో డ్రగ్స్ కలకలం రేపింది. హైదరాబాద్ లోని ఇల్యూషన్ పబ్ లో డీజే ఆర్టిస్ట్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతన్ని పోలీసులు అరెస్టు చేసినట్లు కూడా సమాచారం అందుతోంది.

నార్సింగి లో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 5 గ్రాముల కొకైన్‌ సీజ్ కూడా చేశారు. మరోవైపు హైదరాబాద్ నగరవ వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన‌ సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, అబిడ్స్‌, గన్‌ఫౌండ్రీ, బషీర్‌బాగ్‌, ఐమాక్స్‌, దోమలగూడ ప్రాంతాల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు చేశారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిపి డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు చేపట్టారు ట్రాఫిక్‌ పోలీసులు.

Next Story