- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IT Raids: చేవెళ్ల మాజీ ఎంపీ ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
డీఎస్‌ఆర్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్ సంస్థతో లావాదేవీల జరిపిన చేవెళ్ల మాజీ ఎంపీ ఇంట్లో రెండ్రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు (IT Rides) విస్తృత స్థాయిలో కొనసాగుతున్నాయి. డీఎస్‌ఆర్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్ సంస్థతో లావాదేవీల జరిపిన చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి (Former MP Ranjith Reddy) ఇంట్లో రెండ్రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న తెల్లవారుజామునే ఐటీ బృందాలు ఆయన ఇంటికి చేరుకొని తనిఖీలు ప్రారంభించాయి. అర్ధరాత్రి వరకు కూడా సోదాలు కొనసాగించగా, ప్రస్తుతం ఒక టీమ్ ఇంకా సోదాలు చేస్తోందని తెలిసింది. డీఎస్‌ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టుల్లో నగదు లావాదేవీలను వెలికి తీయడమే లక్ష్యంగా ఈ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. అలాగే డీఎస్ఆర్ ఇన్‌ఫ్రా స్ట్రక్షర్, డీఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, డీఎస్ఆఱ్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, డీఎస్ఆర్ ప్రైమ్ స్పేస్ వంటి సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో అధికారులు పెద్ద మొత్తంలో పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ కంపెనీ అధినేతల బ్యాంకు లాకర్లు కూడా గుర్తించారు. అవి నేడు తెరవనున్నట్లు సమాచారం అందుతోంది.
డీఎస్ఆర్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పార్టనర్‌గా రంజిత్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. రంజిత్‌రెడ్డిక డీఎస్ఆర్ గ్రూపులోని పలు ఇన్‌ఫ్రా సంస్థలతో సహా అనేక కంపెనీలతో సంబంధం ఉన్నట్లు ఆధారాల సేకరణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఏపీ లిక్కర్ స్కామ్‌లో లింక్ ఉన్న శ్రీనివాస్ కన్‌స్ట్రక్షన్స్, శ్రీనివాస్ ఇన్‌ఫ్రా కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కంపెనీల్లో ఆర్థిక లావాదేవీలపై ఐటీ శాఖ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.






