బ్రేకింగ్: బాగ్ అంబర్ పేట కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి ఇంటిపై ఐటీ దాడులు..!

by Satheesh |   (  Updated:2023-11-29 18:47:32  IST  )

మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సమయంలో రాష్ట్రంలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా బాగ్ అంబర్ పేట కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి

బ్రేకింగ్: బాగ్ అంబర్ పేట కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి ఇంటిపై ఐటీ దాడులు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బాగ్ అంబర్ పేట్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి ఇంటిపై బుధవారం అర్ధరాత్రి ఐటీ అధికారులు దాడి చేసినట్టు తెలిసింది. కొంతకాలం క్రితమే పద్మ వెంకట్ రెడ్డి దంపతులు బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాగా, ఓటర్లకు పంచటానికి వీళ్లు ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు నిల్వ చేశారన్న సమాచారం మేరకు ముందుగా పోలీసులు వారి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో అక్కడకు వచ్చిన ఐటీ అధికారులు పద్మ వెంకట్ రెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. ఎంత మొత్తంలో నగదు పట్టుబడిందన్న వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Next Story