- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IT Raids: సినీ ప్రముఖుల ఇళ్లలో ముగిసిన ఐటీ సోదాలు.. కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు చేపట్టిన సోదాలు ఇవాళ తెల్లవారుజాము వరకు కొనసాగాయి. నిర్మాత దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ యజమానులు యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, మ్యాంగ్ మీడియా సంస్థకు చెందిన వారి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా దిల్ రాజును శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నంచి సాగర్ సొసైటీలో ఉన్న ఎస్వీ క్రియేషన్స్ కార్యలయానికి ఐటీ అధికారులు తీసుకెళ్లారు. అక్కడ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలక డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్క్‌లను ఆయన ఎదుటే పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఎన్నడూ లేని విధంగా ఐటీ రెయిడ్స్ నగరంలో నాలుగు రోజుల పాటు జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Next Story