Minister Malla Reddy ఇంట్లో ఐటీ రైడ్స్ : మంత్రి Talasani Srinivas Yadav కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   (  Updated:2022-11-22 07:26:53  IST  )

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Minister Malla Reddy ఇంట్లో ఐటీ రైడ్స్ : మంత్రి Talasani Srinivas Yadav కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాటాకు చప్పుళ్లకు భయపడబోమన్నారు. ప్రజల మన్ననలు పొందేలా ప్రభుత్వాలు వ్యవహరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు టార్గెట్ చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు గమనిస్తున్నారన్నారు. వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న దాడులను కక్షపూరిత దాడులుగా తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ నాయకులు తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. హోం మంత్రి మహమూద్ అలీ, జీహెచ్ ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: IT Raids On Malla Reddy: సోదరుడి ఇంట్లో లాకర్ కనుగొన్న ఐటీ అధికారులు

Next Story