Minister Mallareddy: ఢిల్లీ ఒత్తిళ్లతో పని చేస్తున్న ఐటీ అధికారులు

by Disha Web Desk 4 |
Minister Mallareddy: ఢిల్లీ ఒత్తిళ్లతో పని చేస్తున్న ఐటీ అధికారులు
X

దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి: ఐటీ అధికారులు ఢిల్లీ ఒత్తిళ్లతో పనిచేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో హైదరాబాద్ చేరుకున్న అల్లుడు రాజశేఖర్ రెడ్డిని కలిసేందుకు మంత్రి మల్లారెడ్డి వెళ్లారు. ఈ నేపథ్యంలో మీడియాతో మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. అంతా ఆన్ లైన్ ప్రాసెస్ నడుస్తుందని తన ఇంట్లో వాళ్లకు కూడా మెడికల్ సీటు ఇవ్వలేమన్నారు. నాకు తెల్వకుండా మా పెద్ద కొడుకు‌తో సంతకాలు పెట్టించే ప్రయత్నం చేశారన్నారు. అధికారులపై తాను ఎక్కడా చేయి చేసుకోలేదన్నారు. కావాలని దౌర్జన్యం చేసి మా కుటుంబ సభ్యులను, సిబ్బందిని ఇబ్బంది పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. మేము ఎం తప్పు చేశామని అధికారులను ప్రశ్నించారు.

దొరికిన డబ్బులను అధికారులు తీసుకెళ్లారు కదా అన్నారు. తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యని అందిస్తున్నామన్నారు. ఇంకా రెండు రోజులు తనిఖీలు చేసినా సహకరిస్తామన్నారు. మొత్తం ఆన్‌లైన్‌లోనే తప్పు చేసిన లెక్కలు చూపిస్తే కడుతాం కదా..? ఇప్పటి వరకు మూడు రైడ్స్ తనపై జరిగాయన్నారు. ఎప్పుడూ ఇలా రైడ్ చేయలేదని గుర్తు చేశారు. ల్యాప్‌టాప్ మా అటెండర్ తీసుకువచ్చాడు మళ్ళీ అప్పగించేశాం అన్నారు. ఒక్క ఫోన్ చేస్తే తప్పు ఏముంది. 48 గంటల పాటు నన్ను ఇంట్లోనే పెట్టారు. ఏమైనా కేసులు పెట్టని.. ఈ రెండు రోజుల్లో అయిపోయేది కాదు. ఇంకా 3 నెలలు రోజు తనని పిలుస్తారన్నారు. వెళ్లి అన్ని అంశాలపై క్లారిటీ ఇస్తానన్నారు. గతంలో రెండు సార్లు తనిఖీలు చేశారు. మల్లారెడ్డి కేసీఆర్ వెంటే ఉంటారన్నారు. టీఆర్‌ఎస్ నాయకులం దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. తమ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.



Next Story