- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Davos: వ్యవసాయ రంగం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్.. ప్రముఖ కంపెనీతో ఐటీ మంత్రి
పెట్టుబడులను ఆకర్షించడానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో అత్యంత కీలకమైన సమావేశాలకు సర్వసన్నద్ధమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పెట్టుబడులను ఆకర్షించడానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో అత్యంత కీలకమైన సమావేశాలకు సర్వసన్నద్ధమైంది. (Davos) దావోస్‌లోని (World Economic Forum) తెలంగాణ పెవీలియన్‌లో సప్లయ్ చైన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ రంగాల్లో ప్రఖ్యాత కంపెనీ ఎజిలిటీ (Agility) వైఎస్ చైర్మన్ తారెక్ సుల్తాన్‌తో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు (IT Minister Sridhar Babu) మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో పాటు రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి శ్రీధర్ బాబు ఈ సమావేశంలో వివరించారు.
మరోవైపు తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం రాష్ట్రంలో సెమీకండక్టర్ పరిశ్రమలో పెట్టుబడుల అవకాశాలను చర్చించడానికి ప్రఖ్యాత సంస్థ సాంబానోవా సిస్టమ్స్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సులేతో సమావేశం నిర్వహించారు. కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో లో ప్రధాన కార్యాలయం కలిగిన సాంబానోవా సిస్టమ్స్, ఏఐ ఆవిష్కరణకు వెన్నెముకగా పనిచేసే, ఏఐ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది. ఈ సంస్థతో చర్చలు ప్రోత్సాహకరంగా, సానుకూలంగా ఉన్నట్లు ఎక్స్ వేదికగా తెలంగాణ సీఎంవో పేర్కొంది.






