- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా ఉపయోగం లేదు.. ఉపఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క
అధికారంలోని లేని బీఆర్ఎస్ (BRS) పార్టీ అభ్యర్థి గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు ఉపయోగం ఉండదని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అధికారంలోని లేని బీఆర్ఎస్ (BRS) పార్టీ అభ్యర్థి గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు ఉపయోగం ఉండదని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. ఇవాళ ఆమె జూబ్లీహిల్స్ నియెజకవర్గ పరిధిలోని బోరంబండ (Borabanda) జ్యోతినగర్ కాలనీలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. చేయి గుర్తుకు ఓటెయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి నవీన్‌యాదవ్ (Naveen Yadav) గెలుపు చాలా అవసరమని అన్నారు. మూడుసార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని అన్నారు. అందుకే పేదలకు ఉచితంగా బియ్యం, ఉచిత రవాణా, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. తమ ప్రభత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 లక్షల మందికి ఇండ్లను మంజూరు చేశామని సీతక్క తెలిపారు.
మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కార్ ఎంతగానో పని చేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. ప్రతి మహిళను మహిళా సంఘాల్లో చేర్చుతున్నామని తెలిపారు. మహిళలకు రూ.27 వేల కోట్ల బ్యాంకు రుణాలిచ్చామని, మహిళా సంఘాలకు ప్రమాద, లోన్ బీమా కల్పిస్తున్నామని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అభివృద్ధి పనులు చేయలేదని.. పనిచేసే వ్యక్తి నవీన్‌యాదవ్‌నే జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. ఎన్నికల్లో నవీన్‌యాదవ్ రెండు సార్లు ఓడినా వెనుకడుగు వేయలేదని, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉన్నాడని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే అతడినే గెలిపించాన్నారు. ఇల్లు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యాలని.. కన్నీళ్లు కావాలంటే మరొకరికి ఓటెయ్యాలని సీతక్క పిలపునిచ్చారు.






