- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ లాంటి వాళ్లు సభలో ఉండటం దురదృష్టకరం.. గుత్తా ఫైర్
తెలంగాణ శాసనమండలిలో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మైనింగ్ అక్రమాలపై హౌజ్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు చేపట్టిన నిరసన చివరకు వారి సస్పెన్షన్‌కు దారితీసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ శాసనమండలిలో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మైనింగ్ అక్రమాలపై హౌజ్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు చేపట్టిన నిరసన చివరకు వారి సస్పెన్షన్‌కు దారితీసింది. బీఆర్ఎస్ సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి వైఖరిని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తప్పుబట్టారు. సభ్యుల నిరసనల నేపధ్యంలో చైర్మన్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ, ఇది పెద్దల సభ.. మీ లాంటి వాళ్లు సభలో ఉండటం దురదుష్టకరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలి ఏర్పాటు అప్పటి నుండి సభ్యులు సస్పెండ్ అయిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారాన్ని లేవనెత్తారు. ఈ సంస్థపై తక్షణమే హౌజ్ కమిటీ వేయాలని, అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రి పొంగులేటిని వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో పోడియం వద్దకు దూసుకెళ్లారు.
40 నిమిషాల పాటు అంతరాయం
ఈ దశలో చైర్మన్ జోక్యం చేసుకుని పెద్దల సభలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని, సభ గౌరవాన్ని కాపాడాలని, సభ్యులు మీ మీ స్థానాల్లో వెళ్లి కూర్చోవాలని పదేపదే కోరినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ కాగితాలు చించివేసి నిరసన కొనసాగించారు. సభ ప్రారంభం నుంచే బీఆర్ఎస్ పక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేయడంతో సుమారు 40 నిమిషాల పాటు సభ నిర్వహణకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, వారు వెనక్కి తగ్గలేదు. కాగితాలు చించివేస్తూ నిరసనను ఉధృతం చేశారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ, చైర్మన్ పదేపదే అప్పీల్ చేస్తున్నా వినకుండా, సభ సజావుగా సాగకుండా అడ్డుతగలడం సరికాదని సీరియస్ అయ్యారు.
బీఆర్ఎస్ సభ్యులు గందరగోళం
ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మైనింగ్ పై మూడు సార్లు హౌజ్ కమిటీ వేసినా ఒక్కసారి కూడా సమావేశం కాలేదు’ అని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పక్ష నాయకులు సి.మధుసూదనాచారి మాట్లాడుతూ హౌజ్ కమిటీ వేయడానికి ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్ బాబు, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జోక్యం చేసుకుని సభ్యులు నిరసన వీడి మీ మీ స్థానాల్లో వెళ్లి కూర్చోవాలని పదేపదే కోరారు. సభా సంప్రదాయాలను గౌరవించాలని కోరినా ఫలితం లేకపోవడంతో, బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసే తీర్మానాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టగా చైర్మన్ బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి, సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయినప్పటికీ సభలో ఉండగా చైర్మన్ ఆదేశం మేరకు మార్షల్స్ సహాయంతో సభ్యులను సభ నుంచి బయటకు పంపారు. అనంతరం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, పెద్దల సభలో ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని, సభ్యుల తీరు చాలా బాధగా ఉందన్నారు.






