- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Eatala Rajender: పేదల వైద్యం పట్ల పట్టింపు లేకపోవడం బాధాకరం.. ఈటల రాజేందర్
బొల్లారం, అల్వాల్ ప్రభుత్వ ఆస్పత్రులను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బొల్లారం, అల్వాల్ ప్రభుత్వ ఆస్పత్రులను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. నిర్మాణం పూర్తి చేసి దాదాపు ఎనిమిది నెలలు అయినా అల్వాల్ ఆస్పత్రి ఇంకా ప్రారంభించలేదు. ఈ రోజు వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి త్వరలో ప్రారంభించేలా చూస్తానని స్థానికులకు ఎంపీ ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ పేదలకు మంచి వైద్యం అందించేదని గుర్తుకు చేశారు. కానీ కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా.. పాత బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ కడితే మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు అని భావిచామని తెలిపారు. అయితే బిల్డింగ్ పూర్తి చేసిన కాంట్రాక్టర్‌కి డబ్బులు రాలేదని తాళాలు వేసుకోవడంతో అనేక నెలలుగా వైద్య సేవలు నిలిచిపోయాయని తెలిపారు.
రాజకీయ పట్టింపులు, కాంట్రాక్టు బిల్లులు రాకపోవడం, పేద ప్రజల వైద్యం పట్ల పట్టింపు లేకపోవడం బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజే వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి దీనిని వెంటనే ప్రారంభోత్సవం చేసే ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. స్టాఫ్ ను సంపూర్ణంగా నియమించి, వైద్య పరికరాలు తెప్పించి, పేద ప్రజానీకానికి వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.






