- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తదో.. రాదో తెల్వదు: మంత్రి జూపల్లి సెన్సేషనల్ కామెంట్స్
కాంగ్రెస్ (Congress) పార్టీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో.. రాదో తెలియదని మంత్రి జూపల్లి కృష్ణా రావు (Jupally Krishna Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ (Congress) పార్టీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో.. రాదో తెలియదని మంత్రి జూపల్లి కృష్ణా రావు (Jupally Krishna Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అదిలాబాద్ (Adilabad) పర్యటనలో ఉన్న ఆయన బోథ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరారు. అందుకు స్పందించిన మంత్రి జూపల్లి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో.. తెలియదని, ఒకవేళ తాను గెలిచినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో అని కామెంట్ చేశారు. అందుకే ప్రజలకు తాను ఎలాంటి హామీలు ఇవ్వబోనని అన్నారు. అయితే, మంత్రి జూపల్లి కృష్ణా రావు మాటల విన్న అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సారు.. అధికార పార్టీలో ఉన్నారనే విషయాన్ని మరిచి మాట్లాడారేమో అని.. చెవులు కొరుక్కున్నారు






