కాంగ్రెస్ అభ్యర్థులను నిర్ణయించేది కేసీఆరే.. బండి సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 4 |
కాంగ్రెస్ అభ్యర్థులను నిర్ణయించేది కేసీఆరే.. బండి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థులను నిర్ణయిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంపాపేటలో సోమవారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన విశ్వాస ఘాతకుడు సీఎం కేసీఆర్ అని ఆయన విమర్శలు చేశారు. తెలంగాణలో ఒంటరిగా పోటీచేసి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తంచేశారు. స్వయంగా సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నారని బండి బాంబుపేల్చారు. కాంగ్రెస్ బలంగా ఉంటే జీహెచ్ఎంసీ, వరంగల్, నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయిందని ఆయన ప్రశ్నించారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాలకు తెలంగాణకు సంబంధం లేదని బండి తెలిపారు. ప్లాన్ ప్రకారం తెలంగాణలో బీజేపీనిపై కుట్రలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ కర్ణాటకలో కాంగ్రెస్‌కు డబ్బులు పంపించారని సంజయ్ ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్, ఎంఐఎం అధ్యక్షులే కాంగ్రెస్‌కు ఓట్లు వేయించారన్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ బీఆర్ఎస్‌కు ఎలా ప్రత్యామ్నాయమవుతుందని సంజయ్ అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలసి పోటీచేస్తాయని జానారెడ్డి, వెంకటరెడ్డి లాంటి నేతలే చెప్పారని బండి గుర్తుచేశారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయిందని విమర్శలు చేశారు. కేసీఆర్ హాయాంలో తెలంగాణలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం రెండు మూడు విద్యా సంస్థల కోసమే పనిచేస్తోందని బండి ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే పేదలకు పక్కా ఇండ్ల నిర్మాణం చేపడతామని సంజయ్ హామీ ఇచ్చారు. నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామన్నారు.

అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామి సంజయ్ స్పష్టంచేశారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, మధ్యప్రదేశ్ ఇంఛార్జీ మరళీధర్ రావు, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ రాష్ట్ర సహ ఇంఛార్జీ అరవింద్ మీనన్, తమిళనాడు సహ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, ఏపీ జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ కేవీఎన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Read More: వచ్చే నెలలో BJP రెండు భారీ బహిరంగసభలు.. గెస్ట్‌లు వీరే!

పొంగులేటి బచ్చా.. దోపిడీ దారులే ఆయన పంచన చేరారు : పువ్వాడ


Next Story

Most Viewed