- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
175 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం హర్షనీయం
ఉద్యాన శాఖలో రైతులకు సహాయపడేందుకు నియమించిన ఉద్యాన విస్తరణాధికారులు 175 మందిని తిరిగి ప్రభుత్వం నియమించడం పట్ల విస్తరణాధికారులు సంఘం హర్షం వ్యక్తం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యాన శాఖలో రైతులకు సహాయపడేందుకు నియమించిన ఉద్యాన విస్తరణాధికారులు 175 మందిని తిరిగి ప్రభుత్వం నియమించడం పట్ల విస్తరణాధికారులు సంఘం హర్షం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం 2020 మే 20న కరోనా కాలంలో బడ్జెట్ కారణం చూపుతూ ఆకారణంగా తమను విధుల నుంచి తొలగించిందని, కరోనా తర్వాత విధుల్లోకి తీసుకోవాలని మంత్రుల, ఎమ్మెల్యేలు చుట్టూ తిరిగి స్పందన లేదన్నారు. ఐదు సంవత్సరాల పాటు తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనామని ఆ సంఘం నాయకులు విశ్వనాథ రెడ్డి, సెక్రటరీ సంధ్యా జోషి తెలిపారు.
రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన కాంగ్రెస్ప్రభుత్వం తమకు ఎన్నికల్లో హామీ ఇచ్చి విధుల్లోకి తీసుకోవడం మరిచిపోలేమని పేర్కొన్నారు. ఆదివారం ప్రజా భవన్లో ప్లానింగ్ కమిషన్ వైస్‌చైర్మన్ చిన్నారెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 175 కుటుంబాలు ప్రభుత్వానికి రుణపడి ఉంటాయన్నారు. ఉద్యోగులమంతా ఎల్లవేళలా రైతు సేవాలో ఉద్యాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో రైతుల మధ్య బలమైన అనుసంధానంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బండి వేణు కుమార్, సైదులు, బాల ప్రకాష్, సాగరిక, దేవేందర్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.






