- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నోటిఫికేషన్ వచ్చాక స్టే ఇవ్వడం దారుణం.. ఎంపీ ఆర్.కృష్ణయ్య హాట్ కామెంట్స్
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చాక హైకోర్టు (High Court) బీసీ రిజర్వేషన్ జీవోపై స్టే ఇవ్వడం దారణమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చాక హైకోర్టు (High Court) బీసీ రిజర్వేషన్ జీవోపై స్టే ఇవ్వడం దారణమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై బీసీలు గంపెడాశలు పెట్టుకున్నారని.. ఈ సమయంలో ఇలాంటి తీర్పును తాము ఆశించలేదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బలమైన ఆధారాలతోనే జీవో నెంబర్ 9ని విడుదల చేశారని, శాస్త్రీయంగా కులగణన ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. కానీ, హైకోర్టు తీర్పుపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అనుమానాలున్నాయని బాంబు పేల్చారు. రాష్ట్రాలు రిజర్వేషన్లు పెంచుకోవచ్చని రాజ్యంగంలోని 243/D6 షెడ్యూల్ స్పష్టంగా ఉందని అన్నారు. కానీ, రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. బీసీలు ఎంత ఉన్నారో.. తమకు అంత రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. బీసీ బిల్లు (BC Bill)ను పార్లమెంట్‌లోనూ పెట్టాలని పోరాడుతున్నామని తెలిపారు. ఇవాళ బీసీ సంఘాల తరఫున ర్యాలీలు, నిరసనలు ఉంటాయని.. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.






