ఆ మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయి.. స్టేట్ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-24 13:26:21  IST  )

తెలంగాణ (Telangana)లో పంచాయతీ ఎన్నికలు ఆలస్యంగా నిర్వహించడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయి గ్రామాలు అభివృద్ధి నోచుకోలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు (Ramchander Rao) ఆరోపించారు.

ఆ మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయి.. స్టేట్ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో పంచాయతీ ఎన్నికలు ఆలస్యంగా నిర్వహించడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయి గ్రామాలు అభివృద్ధి నోచుకోలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు (Ramchander Rao) ఆరోపించారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌ (Hyderabad)లో మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాలకు సంవత్సరానికి రూ.3 వేల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమేనని ఆయన విమర్శించారు. ఎన్నికలు సకాలంలో ఎన్నికలు జరగకపోవడంతో గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయని అన్నారు. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలను కలపడానికి మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ ప్రయత్నిస్తోందని, భవిష్యత్తులో ఆ మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లడం ఖాయమని కామెంట్ చేశారు. అలాగే, ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘించిందని ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ చేరినట్లుగా ఆధారాలు ఉన్నా అసెంబ్లీ స్పీకర్ వారిపై చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసినట్లేనని రాంచందర్‌రావు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

Next Story