- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
90-hour work: 'మేమేమి మీ బానిసలం కాదు' పని గంటలపై కర్ణాటకలో రొడెక్కిన ఐటీ ఉద్యోగులు
పని గంటలపై కర్ణాటకలో ఐటీ ఉద్యోగులు రొడెక్కారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా పని గంటలపై తీవ్ర చర్చ జరుగుతున్నది. వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ నారాయణ(Infosys Narayana), వారానికి 90 గంటలు పని చేయాలంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (L&T Subrahmanyam) చేసిన వ్యాఖ్యలు ఐటీ సెక్టార్ లో పెద్ద ఎత్తున రచ్చ నడుస్తోంది. ఉద్యోగం, కుటుంబం సంబంధాలను మేనేజ్ చేసుకోలేక సతమతం అవుతుంటే అదనపు గంటలు పని చేయాలని పరిశ్రమ పెద్దలు పిలుపినివ్వడంపై టెకీలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు తమ అభిప్రాయాలను సామాజిక మాద్యమాల వేదికల ద్వారా పంచుకున్న ఉద్యోగులు ఇక రోడ్లపైకి (Protest against extra working hours) వస్తున్నారు. తాజాగా బెంగళూరు (Bangalore) నగరంలోని ఫ్రీడమ్ పార్క్ వద్ద ఇటీవల ఐటీ ఉద్యోగులు (IT Employees) ధర్నా చేయడం, వీరి ఆందోళనకు సీఐటీయూ మద్దతు తెలపడంతో ఐటీ ఉద్యోగుల అందోళనలో కొత్త ట్విస్ట్ గా మారింది.
ఉద్యమం తీవ్ర రూపం?:
వారానికి 70-90 పని గంటల పని చేయాలని ఓ వైపు నారాయణ మూర్తి, ఎల్ అండ్ టీ సుబ్రహ్మణ్యం పదే పదే ప్రస్తావింస్తుండగా మరో వైపు ఉద్యోగుల పని గంటలను 8 నుంచి 14 గంటలకు పెంచాలని కంపెనీలు కర్ణాటక ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ పరిణామాలపై కన్నెర్ర చేసిన ఐటీ ఉద్యోగులు తమ నిరసన గళం విప్పారు. ఆరోగ్యకరమైన పని-జీవన సమతుల్యత ప్రతి ఉద్యోగి హక్కు అనే నినాదంతో ఆందోళన బాట పట్టారు. ఉద్యోగులకు మద్దతుగా సీఐటీయూ (CITU) మద్దతుగా నిలవడం ఈ ఉద్యమం క్రమంగా ఉధృతం కాబోతున్నదా అనే చర్చ రాజకీయ, పరిశ్రమ వర్గాల్లో నెలకొంది. గతేడాదే ఐటీ ఉద్యోగ సంఘం కర్ణాటక కార్మిక శాఖ మంత్రికి పని గంటల విషయంలో కంపెనీల ప్రవర్తన, తమ సమస్యలపై మెమోరాండం సమర్పించిది. అయినా సమస్యలు పరిష్కారం కాకపోగా అదనపు సమయం అందుబాటులో ఉండాలని ఆయా సంస్థలు సంస్థలు ఒత్తిడి తీసుకువస్తున్నాయంటూ ఆందోళన బాట పట్టారు. వీరి వ్యాఖ్యలపై రగిలిపోతున్న ఐటీ ఉద్యోగులు ఈ నిరసనలో భాగంగా వారి దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కర్నాటకలో మొదలైన ఈ ఆందోళనలు త్వరలోనే దేశవ్యాప్తంగా పుట్టుకురాబోతున్నాయా చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.






