భారతీ ఎయిర్‌టెల్‌కు సహకరించండి.. ప్రభుత్వానికి లేఖ

by Gantepaka Srikanth |

భారతీ ఎయిర్‌టెల్‌కు సహకరించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ (ఐటీ, ఈఅండ్‌సీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

భారతీ ఎయిర్‌టెల్‌కు సహకరించండి.. ప్రభుత్వానికి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారతీ ఎయిర్‌టెల్‌కు సహకరించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ (ఐటీ, ఈఅండ్‌సీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఐటీ ఈఅండ్‌సీ డైరెక్టర్, డీఓటీ, ఏపీఎల్‌ఎస్‌ఏ నుండి ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రెటరీ నవీన్ మిట్టల్‌కు లేఖ పంపించారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్ ద్వారా విద్యుత్ స్తంభాలపై వేసిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను తొలగించకుండా నిలిపివేయాలని సూచించారు. దీనివల్ల హైదరాబాద్‌లోని 500 సైట్లలో విస్తరించి ఉన్న 220కి పైగా కార్పొరేట్ సంస్థలతోపాటు 50,000 మందికిపైగా వినియోగదారులకు బ్రాడ్‌బ్యాండ్ టెలికాం సేవలు దెబ్బతినే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. భారతీ ఎయిర్‌టెల్ సరైన మార్గదర్శకాలకు అనుగుణంగా ఓవర్‌హెడ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేసిందని, వాటిని బలవంతంగా తొలగించడం వల్ల టెలికాం నెట్‌వర్క్‌కు తీవ్రమైన అంతరాయం కలుగుతున్నదని తెలిపారు. ఇది డిజిటల్ చెల్లింపులతో సహా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని పేర్కొన్నారు. 2024లో జారీ చేసిన ‘రైట్ ఆఫ్ వే రూల్స్’ ప్రకారం ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story