స్టేట్ లెవెల్ హ్యాండ్ బాల్ పోటీల్లో ప్రతిభ చాటిన ఇషాంత్

by Disha Web Desk 4 |
స్టేట్ లెవెల్ హ్యాండ్ బాల్ పోటీల్లో ప్రతిభ చాటిన ఇషాంత్
X

దిశ,బెల్లంపల్లి: 37వ బాయ్స్ సబ్ జూనియర్ తెలంగాణ స్టేట్ లెవెల్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సి‌ఓ‌ఈ విద్యార్థి డి. ఇశాంత్ రన్నర్‌గా నిలిచాడు. ఈ నెల 10 నుండి 12 వరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో స్టేట్ హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు అత్యంత ప్రతిభ చూపి రన్నర్‌గా నిలిచింది.

ఈ జట్టులో అత్యంత క్రీడా నైపుణ్యతతో ఆడి జట్టు విజయానికి తోడ్పడిన డి.ఇషాంత్‌ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గొనె శ్యామ్ సుందర్రావు, కనపర్తి రమేష్‌లు ప్రత్యేకంగా అభినందించి ట్రోఫీ అందజేసినట్లు సి‌ఓ‌ఈ ప్రిన్సిపల్ ఐనాల సైదులు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం కళాశాలలో ఇషాంత్‌ను ప్రిన్సిపల్ ఐనాల సైదులు, పిడి అల్లూరి వామన్ పి‌ఈ‌టి ఎన్ రాకేష్ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఈ‌టీ రాజేష్ పీడీ వామన్, ఉపాధ్యాయులు పొన్నం శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ కే. రాజకుమార్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed