- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే..? రేవంత్ సర్కార్‌కు కవిత సూటి ప్రశ్న
పేదింటి బిడ్డలను రేవంత్ రెడ్డి సర్కార్ చదువులకు దూరం చేస్తోందని.. ఇదేనీ ఇందిరమ్మ పాలన అని మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: పేదింటి బిడ్డలను రేవంత్ రెడ్డి సర్కార్ చదువులకు దూరం చేస్తోందని.. ఇదేనీ ఇందిరమ్మ పాలన అని మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఫైర్ అయ్యారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ (Best Available Scheme)లో భాగంగా ప్రైవేట్ స్కూళ్లలో చదువుతోన్న వేలాది మంది విద్యార్థుల ఫీజులు చెల్లించని ప్రభుత్వంపై ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద నయా పైసా ప్రైవేటు పాఠశాలలకు నిధులు విడుదల చేయలేదని ఆమె మండిపడ్డారు.
ఫీజులు చెల్లించడం లేదని విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతించడం లేదని కవిత ధ్వజమెత్తారు. నల్గొండ, జగిత్యాల జిల్లా కేంద్రాల్లోని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం దసరా సెలవుల తర్వాత వచ్చిన విద్యార్థులను క్లాస్ రూముల్లోకి అనుమతించకుండా బయటే నిలబెట్టారని, ఫీజులు చెల్లిస్తే కానీ లోపలికి రానిచ్చేది లేదని తేల్చిచెప్పిందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో స్కూళ్లను నడుపలేకపోతున్నామని.. తమకు ఫీజులు చెల్లించకుంటే విద్యార్థుల తల్లిదండ్రులే ఆ భారం మోయాలని యాజమాన్యం స్పష్టం చేసింది. తమ గోడు చెప్పుకునేందుకు జగిత్యాల కలెక్టరేట్‌కు వెళ్లిన విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎలాంటి ఉపశమనం దక్కలేదన్నారు. ఫీజుల కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి విన్నవించుకోవాలని కలెక్టరేట్ సిబ్బంది సలహా ఇచ్చారు. ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే.. ఇదేనా ప్రజా పాలన అంటూ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.






