- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bandi Sanjay : కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా..? ముదిగొండ ఘటనపై బండి సంజయ్ సీరియస్
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల(Mudigonda Ashram School Incident)లో సోమవారం అల్పాహారం తిన్న తర్వాత దాదాపు 32 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల(Mudigonda Ashram School Incident)లో సోమవారం అల్పాహారం తిన్న తర్వాత దాదాపు 32 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారిని వార్డెన్స్, ఉపాధ్యాయులు వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి, మరి కొందరిని తోర్రుపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో 13 మంది విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై బీజేపీ నేత బండి సంజయ్(Bandi Sanjay) తీవ్రంగా స్పందించారు.
గత బీఆర్ఎస్ పాలనలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు సర్వసాధారణంగా జరిగేవని. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు తెస్తామని హామీ ఇచ్చినప్పటికీ అదే సమస్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. విద్యార్థులకు సరైన ఆహారం అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో ఉండే హక్కు లేదని ఆయన విమర్శించారు. ఆశ్రమ పాఠశాలల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తోందని, వెంటనే చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు.






