Eatala Rajender: హైదరాబాద్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆలోచన ఉందా లేదా? లోక్ సభలో ఈటల ప్రశ్న

by Prasad Jukanti |   (  Updated:2025-02-03 13:03:21  IST  )

లోక్ సభలో ఈటల రాజేందర్ కీలక కీలక అంశాలపై ప్రశ్నించారు.

Eatala Rajender: హైదరాబాద్ లో  స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆలోచన ఉందా లేదా? లోక్ సభలో ఈటల ప్రశ్న
X

దిశ, డైనమిక్ బ్యూరో: అగ్రికల్చర్, డైరీ లాంటి లైవ్ స్టాక్ పథకాలు తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) కోరారు. లైవ్ స్టాక్ పథకాలు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. లోక్ సభలో (Lok Sabha) ఇవాళ ప్రశ్నోత్తరాల సమయంలో (Question and Answer Hour) మాట్లాడిన ఈటల రాజేందర్ భారతదేశంలో యువశక్తి చాలా ఎక్కువ ఉందని ఐటీ, మ్యానిఫాక్చర్, సర్వీస్ పనిచేసేవారికి నాణ్యతతో కూడిన శిక్షణ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసే ఆలోచన ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విదేశాలకు వెళ్లే పిల్లలకు భారత ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు ఏంటి? పాస్ పోర్టు తీసుకున్న దగ్గరినుండి వీసా ఇప్పించడం, మంచి కంపెనీలలో ఉద్యోగం ఇప్పించడం వరకు ప్రభుత్వం సాంకేతిక సహకారం అందించాలి. విదేశాలకు వెళ్లే విద్యార్థులు ధ్రువీకరణ లేని కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ జైలుపాలు కాకుండా చూసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వివరించాలని కోరారు. 2047 వికసిత్ భారత్ కోసం ప్రధాని మోడీ ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు యువతకు అవసరమైన లోన్లు బ్యాంకులు ఇవ్వడానికి ఇబ్బందులు లేకుండా చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు.

Next Story